రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మదనపల్లి బలిజ సేవా సంఘం అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బలిజ సంఘం కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, తోట కళ్యాణ్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ, సెక్రటరీ అర్జున, ఐటీ విభాగ నాయకులు లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి పవన్ శంకర లవన్న, సెక్రటరీ జనార్దన్, జాయింట్ సెక్రటరీ రెడ్డి శేఖర్ రెడ్డి, సెక్రటరీ జయశేఖర్, గుజిని శీనా తదితరులు పాల్గొన్నారు.