టిడిపి నిరసన దీక్షలకు బంగారు రామదాసు సంఘీభావం

అరకు నియోజకవర్గం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా డుంబ్రి గుడ మండలము, కించు మండలో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రభుత్వము అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ప్రతి ఒక్క నాయకులుగా అరెస్టులు చేయించడం నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా వారాహీ యాత్ర చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అటంకాలు చేస్తూ ఆయనకు నోటిస్ ఇవ్వడం వైసిపి పార్టీకి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇటువంటి ఆలోచనని కథం తొక్కే విధంగా రానున్న ఎలక్షన్ లో జనసేన టిడిపి ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియ పరచడం జరిగింది. ఏజెన్సీ గిరిజన మాన్య ప్రాంతము అభివృద్ధి లేకపోవటం గిరిజన మాన్య ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు రోడ్లు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, సిసి రోడ్ సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం పంచాయతీ నిధుల ద్వారా చేయించలేని పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయని అపోహలు తెలియజేశారు. అలాగే చదువుకున్న యువతకి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు డీఎస్సీ పోస్టింగ్ తీస్తానని హామీలు ఇచ్చిన వైసిపి ప్రభుత్వం రాగానే హౌసింగ్లు ఇష్టమని ఇచ్చిన హౌసింగ్ బిల్లులు కానీ ఇవ్వకుండా చేసిన వైసిపి పార్టీ హౌసింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి, సిపిఎస్ రద్దు చేస్తామని అది చేయలేదు. మద్యపానం బంద్ చేస్తామని చేయలేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని అది చేయలేదు. ప్రతి సంవత్సరము జాబ్ కేలండర్ విడుదల చేస్తామన్న నాయకులు అది కూడా చేయని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నది. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు గమనించి రానున్న రోజుల్లో జనసేన టిడిపిని మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి భావితరాల భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా మన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి గిరిజన మన్య ప్రాంతంలో కూడా మన పిల్లలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే రానున్న రోజుల్లో జనసేన, టిడిపికి మీరు మద్దతు తెలుపాలని మనస్ఫూర్తిగా కోరుచు తెలియజేస్తున్నానని రామదాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాలనాయడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.