విజయనగరం జిల్లా జనసేన లీగల్ కమిటీ సమావేశం

విజయనగరం జిల్లా, శనివారం సాయంత్రం 6గంటలకు కొండపల్లి గ్రాండ్ హోటల్లో విజయనగరం జిల్లా జనసేన లీగల్ కమిటీ సమావేశం కరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర జనసేన లీగల్ సెల్ ఛైర్మెన్ వి.ఎస్.ఎస్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలములో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. దిశ చట్టాన్ని వైస్సార్ ప్రభుత్వము అమలు చేయట్లేదని.. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు శాంతియుతంగా పోరాటాలు చేస్తే పోలీసులతో జగన్ ప్రభుత్వం అక్రమకేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులను కేసులను జనసేన కార్యకర్తలు నాయకులు ఎలా ఎదుర్కోవాలో తగు సూచనలు, సలహాలు ఇస్తూ.. జనసేన కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరి బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ కమిటీలోకి 4 గురు కొత్త సభ్యులను నియమిస్తున్నామన్నారు. ఎస్.కోట నుండి వబ్బిన సన్యాసి నాయుడు(ఎల్.ఎల్.బి), గజపతి నగరం నుండి గెద్ద రవి, నెల్లిమర్ల నుండి తుమ్మిడి లక్ష్మి రాజ్యం, రాజాం నుండి ఎన్ని రాజు లను లీగల్ కమిటీ సభ్యులుగా నియమిస్తున్నామని రాష్ట్ర ఛైర్మెన్ ప్రతాప్ తెలిపారు. ఈ సమావేశములో రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మెన్ మరియు జిల్లా నలుమూలలనుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, జిల్లా జనసేన లీగల్ కమిటీ సభ్యులు ఈ సమావేశములో పాల్గొన్నారు.