అమరజీవికి విజయవాడ జనసేన ఘననివాళి

విజయవాడ, 37వ డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాము గుప్త ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని సామారంగా చౌక్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నాడు ప్రత్యేక ఆంధ్ర కోసం నిరాహార దీక్షను పూని ప్రత్యేక ఆంధ్ర సాధించడంలో తన ప్రాణాన్ని త్యాగం చేశారాని, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ఎందరో మహానుభావులు ఆంధ్ర రాష్ట్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, సమరయోధులు స్ఫూర్తిని మనలో నింపుకోవాలని ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, అక్రమాలు అరాచకాలు హత్య రాజకీయాలు చేస్తున్నారని వారి పై పోరాడాలని, వ్యాపారస్తులు లైట్ల ఆపుకొని వ్యాపారాలు చేయాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిందని, పవన్ కళ్యాణ్ పిలుపు వైసిపి ముక్తాంధ్రప్రదేశ్ కావాలని, పశ్చిమ నియోజకవర్గం పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని తొలగించారని దాన్ని తిరిగి ప్రతిష్ట చేయాలని చాలా సందర్భాల్లో డిమాండ్ చేశామని, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయలేకపోవడానికి విగ్రహం దొంగతనానికి గురైన మాట నిజమని, దీనికి అధికారులు వెల్లంపల్లి కారణమని, త్వరలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తవ్వ మారుతి, అడ్డగిరి పుల్లారావు చల్లా ఏసుబాబు, కిలాని రాము, యాదవ్ స్టాలిన్ శంకర్, వెన్న శివశంకర్, పొట్నూరి శ్రీనివాసరావు, హనుమాన్, బోట్ట సాయి, పులి చేరి రమేష్, శివ మరియు ఆర్యవైశ్య మహిళ నేతలు తదితరులు పాల్గొన్నారు.