గ్రామ గ్రామాన ఉచిత వైద్య శిబిరం

రాజోలు నియోజకవర్గం: రాజోలు జనసేన నాయకులు మరియు సర్పంచ్ విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాపాక రమేష్ బాబు సౌజన్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామం గుబ్బల వారి పాలెం గంటలమ్మ గుడి దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్, బీపీ, గుండెకి సంబంధించి ఈసీజీ మొదలైన రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, రామేశ్వరం గ్రామ జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.