చైనాలో జనసేనాని జన్మదిన వేడుకలు నిర్వహించిన వీరమహిళ గౌరి

చైనా(షాంగై), సింగపూర్ ఎన్నారై వీరమహిళ గౌరి జనసేనాని పుట్టిన రోజుకు భర్త ఉద్యోగ నిమిత్తం చైనాలో ఉండడం వలన ఆమె చైనాలో జనసేనాని జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. చైనీయులను తమ ఇంటికి ఆహ్వానించి వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించి వారి సమక్షంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానమని, మంచి నాయకుడని అలాంటి నాయకునికి అధికారమిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. జనసేనాని పుట్టినరోజు ఏర్పాట్లను చేసిన ఆమె భర్తకు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.