ఒకతరం యువతకి స్ఫూర్తి విరాట్ కోహ్లీ

  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: అసాధారణ భారత క్రికెట్ ఆటగాడు, అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీగా పిలుచుకునే విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతో ఒకతరం యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం శ్రీనివాసరావుతోటలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆళ్ళ హరి మాట్లాడుతూ క్రికెట్ రంగంలో కోహ్లీ చరిత్ర ఒక సువర్ణాక్షరాలతో లికించదగినదని కొనియాడారు. భారతదేశ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా అన్ని విభాగాల్లో యాభై శాతానికి పైగా విజయాలను అందించిన ఘనత ఒక్క కోహ్లీకి మాత్రమే సాధ్యమైందన్నారు. క్రికెట్ రంగంలో ఎన్నో రికార్డులు కోహ్లీ ముందు చిన్నబోయాయన్నారు. భవిష్యత్ క్రీడాకారులకు, ప్రధానంగా యువ క్రికెటర్లకు కోహ్లీ ఒక గ్రంధాలయమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో సైతం విరాట్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో సంచలనాలు సృష్టిస్తున్నాడన్నారు. ఈ సందర్భంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆళ్ళ హరి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోహ్లీ అభిమానులు యామిని విద్యాధరి, తాత్విక, గృహాలక్ష్మి, రామ్ చరణ్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, గడ్డం రోశయ్య, పసుపులేటి నరసింహారావు, కోటంసెట్టి బాలు, బాలకృష్ణ, నండూరి స్వామి, రేవంత్, హఫీజ్, యూసుఫ్, సలామ్, రామ్ చరణ్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.