విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత: అంజూరు చక్రధర్

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని గట్టిగా వినిపించాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అయిన శ్రీ గురుమూర్తి ని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.