మత్స్యకారులకు బాసటగా జనసేన: సంగిశెట్టి అశోక్

కాకినాడ: తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడల్లో మత్స్యకారులు కీలుబొమ్మలుగా మారారనీ వెటనే వృత్తిగా స్వీకరించి వేటాడి తెచ్చుకున్న మత్స్య సంపదనీ విక్రయించి కుటుంబాలను పోషించుకుంటన్న నేపథ్యంలో కాకినాడ శ్రీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కేవీ రావు కుంభాభిషేకం రేవును ఆక్రమించే చర్యలు తీసుకోవడంపై కాకినాడ సిటీ జనసేన ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ స్పందిస్తూ మత్స్యకారులకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వందల యేళ్ళ నుండి కాకినాడ దుమ్ముల పేటకు చెందిన మత్స్యకార కుంభాబిషేకం రేవును నమ్ముకుని జీవిస్తున్నారని ఇటువంటి సందర్భంలో అక్కడి నుండి మత్స్య కారులను బైటకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ, ఇదే కనుక జరిగితే జనసేన పార్టీ అధినేత రంగంలోకి దిగి మత్స్యకారులకు బాసటగా నిలుస్తారని తెలిపారు. మత్స్యకార నాయకులు పేర్ల అమర్నాథ్ మాట్లాడుతూ తరతరాలుగా సముద్రం తమ సొత్తుగా భావించి జీవనం సాగిస్తున్న దుమ్ములపేట మత్స్యకారులకు కాకినాడ సిపోర్ట్ లిమిటెడ్ అధినేత కె.వి. రావు దుర్మార్గపు ఆలోచనతో కుంభాభిశేకం రేవును ఆక్రమించి కోవడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కాకినాడ సముద్రతీరం మత్స్యకారుల కనుసన్నుల్లో ఉండేదని అయితే కేవీ రావు అడుగు పెట్టిన తర్వాత కె.వి. రావు సొంతం అయ్యిందని. తాజాగా కుంభాభిషేకం రేవును కూడా ఆక్రమించి రాజకీయ పలుకుబడితో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు నోట్ల కట్టలు చూపి మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. గతంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించి సి పోర్టు కార్యకలాపాలు సాగిస్తున్న కే వి రావు తెలుగు దేశం ఎమ్మేల్యే, నేటి వైకా పా ఎమ్మేల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిలను గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని. కాకినాడ నగర భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఆదికుంబేశ్వర స్వామి ఆలయం ఆక్రమణ అంటూ కేవి రావు తమ జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పలుకుబడినీ ఉపయోగించుకుని ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నారని తెలిపారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రదినిధులకి మత్స్యకారుల సమస్యలు మరిచి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయడం కాకినాడ ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్నారు. రానున్న రోజుల్లో కెవి రావు కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన గుణపాటం చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, గంధ నూకరాజు, దాసరి ఎల్లాజీ, వాసుపల్లి తాతారావు, వాసుపల్లి కోటేశ్వరరావు, దాసరి దుర్గ తదితరులు పాల్గొన్నారు.