విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

విశాఖ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉక్కు కార్మగారానికి మైన్స్ కేటాయించాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆదివారం కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి సిటీలో ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మహా పాదయాత్ర చేపట్టిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని సందర్భాల్లో మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసిన సందర్భంగా గాజువాక ఇంచార్జ్ పీఏసీ సభ్యులు కోన తాతరావు ఆదేశాలతో మహా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. పాదయాత్రలో కోన తాతారావు రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, రౌతు గోవిందరావు, కాదా శ్రీను, గవర సోమశేఖర్, సాడే రామారావు, జగన్నాథ వెంకటరమణ, ఎలమంచిలి సంజీవ్, అట్ట అప్పారావు, జ్యోతి రెడ్డి, ఇంద్ర ప్రియదర్శన్, శంకర్, స్వరాజ్, సంజీవ్, యోగి, సునీల్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.