విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు: జనసేన నాయకులు సాయిబాబా

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం నేటి నుంచి మూడు రోజులపాటు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని కార్యకర్తలను జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో జనసేన పార్టీ ఎక్స్ ఎం పి టి సి సాయిబాబా, దురియా, సన్యాసిరావు, గెమిలి ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఎంతోమంది త్యాగ ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకో గలిగామని, దీన్ని కాపాడుకోలేక ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ ప్రభుత్వం మద్దతు తెలపడం ఒక పక్క పార్లమెంట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 22 మంది ఎంపీలు గళం విప్పి మాట్లాడకపోవడం ఆంధ్ర ప్రజలకు మోసం చేసినట్లేనని ఈ సందర్భంగా వైయస్సార్ ప్రభుత్వ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ ఎంపీలు తీరు మార్చుకోని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని చూపించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, ఆటో యూనియన్ నాయకులు కొండలరావు, అప్పన్న, సింహాద్రి, రాజ్ కుమార్, అప్పారావు, తులసి రామ్, తదితరులు పాల్గొన్నారు.