మా ఎన్నికల బరిలో మంచు విష్ణు..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్‌. కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీకి మంచి సంబంధాలు నెలకొన్నాయి. దీంతో మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం.

ఇక ముంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఎలా వుంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఎంతయినా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్. విష్ణు లోకల్. అందువల్ల ఇండస్ట్రీ దాదాపుగా విష్ణు వైపే వుండే అవకాశం వుంది. సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ మద్దతు విష్ణుకే అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అయితే ప్రకాష్ రాజ్ ఓ అడుగు ముందులో వున్నారు. ఆయన అప్పుడే ఛానెళ్లలో లైవ్ ప్రోగ్రామ్ లు ఇస్తూ ప్రచారం మొదలు పెట్టేసారు.