వంతడపల్లి గ్రామంలో జనసేన నాయకుల పర్యటన

పాడేరు: గూడెం కొత్త వీధి మండలం, జర్రెల పంచాయితీ వంతడపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో సమావేశమై గ్రామసమస్యలపై ప్రస్తుత పరిస్థితిపై వారితో చర్చించారు. జనసేన పార్టీ నాయకులు గ్రామసమస్యలు పరిశీలించగా గ్రామంలో ప్రధానంగా పాఠశాల భవనం లేక అంగన్వాడి బిల్డింగ్ లో పిల్లలకు పాఠాలు చెప్పే పరిస్థితి ఉన్నది. గడపగడపకు వెళ్ళిన ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గ్రామంలో అనేక హామీలు ఇచ్చి వచ్చినా కూడా హామీలను నెరవేర్చ పని చేయలేదు గ్రామ సంఘాల ముక్తకంఠంతో తమసమస్యలను తెలియజేస్తుంటే మా సమస్యలను పూర్తిగా తెలియనివ్వకుండా మా మాట దాటేస్తూ మధ్యలోనే మమ్మల్ని మాట్లాడనివ్వకుండా మా సమస్యలు పూర్తిగా వినకుండా వెళ్లిపోయారని గ్రామస్తులుగా వాపోయారు. మా గ్రామంలోని ఎమ్మెల్యే వచ్చినందుకు మా గ్రామ సమస్యలను పూర్తిగా తెలియజేద్దామని అనుకుంటే దౌర్జనంగా మాతో మాట్లాడి, మా సమస్యలను కూడా పూర్తిగా తెలియకుండా, వినకుండా తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. మా గ్రామంలోని సమస్యలను తెలుసుకోడానికి వచ్చారేమో అని అనుకుంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అని అడిగేరే తప్ప గ్రామంలోని సమస్యలు ఉన్నాయా అని మాత్రం అడగలేదు. మా గ్రామ సమస్యలు మేము చెప్తుంటే మా మీద దురుసుగా ప్రవర్తించి మాట దాటవేసివెళ్ళిపోయారు. అందుకే భావితరాల బవిష్యత్ కోసం ఆలోచన చేసి మేము ఈరోజు జనసేన పార్టీని ఆదరించి పార్టీ నాయకులను మేము పిలిపించుకున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తరఫున జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేటాయిస్తున్న నాడు నేడు నిధులు ఈ గ్రామనికి వర్తించవా అని వైసి ప్రభుత్వానికి నిలదీశారు, పాత బిల్డింగ్ లకు రంగులు వేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వ తీరుని ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్రల పేరుతో ప్రజాధనాన్ని ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం ఆదివాసీల పిల్లల చదువుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేసింది శూన్యమన్నారు మేము సూటిగా అడుగుతున్నాం ఇటువంటి స్కూల్ బిల్డింగ్ లేని గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ నిర్మించి పిల్లలకి చదువుకోడానికి భవనం నిర్మించి మంచి వాతావరణ కల్పించి, ఓటు వేసిన తమ జాతికి ఎమ్మెల్యే వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ రుణం తీర్చుకోవాలని కానీ ప్రస్తుతం చలబాగా రుణం తీర్చుకున్నారని ఎద్దేవా చేసారు రానున్న ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి మట్టికరిపిస్తారని మోసపోయిన గిరిజన విసిగిపోయి ఉన్నారన్నారు. పాడేరులీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో వార్డ్ మెంబర్ మణుగూరు సత్యనారాయణ గ్రామ పెద్ద లింగమూర్తి సహా గ్రామస్థులు మహిళలు పార్టీలో చేరారు ఈ సమావేశంలో జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జీకే వీధి మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, బి.మార్క్, పి.విష్ణుమూర్తి, అరడా కోటేశ్వరరావు, జి.రఘువంశీ, మధు, వి. ఈశ్వర్రావు, పరమేష్, సిద్ధు, చింతపల్లి మండల అధ్యక్షులు బుజ్జిబాబు, చింతపల్లి నాయకులు బూత్ కన్వినర్ ఉల్లి సీతారామ్ తదితర జనసైనికులు గ్రామయువత పెద్దఎత్తున పాల్గొన్నారు.