పాలచర్ల జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామకం

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, విలువలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను పేదల పెన్నిధి బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి బలోపేతం చేయడం కోసం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ రథసారథి బలరామకృష్ణ ఆదేశాల మేరకు, వారి సమక్షంలో సీనియర్ నాయకుల సూచనలు, సలహాలతో పాలచర్ల జనసేన పార్టీ గ్రామ కమిటీ నియమించి, కమిటీకి నియమితమైన సభ్యులకు అభినందన సత్కారం చేసి నియామకపత్రాన్ని రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.