టెక్కలి నియోకవర్గంలో వివేకానంద జయంతి

భారతదేశ ఖ్యాతిని, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని టెక్కలి నియోకవర్గంలో స్థానిక పాలకేంద్రం ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జీ కణితి కిరణ్ కుమార్. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారని యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు ముడిదాన రాంప్రసాద్, పల్లి కోటి, కొత్తూరు హరి, ఏదూరు చిరంజీవి రెడ్డి, రమేష్, వెంకీ, జనార్దన్ మరియు నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.