హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మాస్కులు పంపిణీ చేసిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

విజయనగరం, ప్రముఖ యువహీరో, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలను వినూత్నమైన రీతిలో విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక కామాక్షి నగర్, అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న బి.సి.కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిమానులంతా బుధవారం ఉదయం కామాక్షి నగర్ లక్ష్మీ గణపతి ఆలయంలో హీరో వరుణ్ తేజ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న బి.సి.కాలనీలో కేక్ ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం కామాక్షి నగర్, అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న బి.సి.కాలనీలో ప్రతీ ఇంటికీ సుమారు రెండువేల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోను, ఇటు జిల్లాలోను కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్లో కరోనా పట్ల మరియు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని, మాస్కులు ధరిస్తే కరోనాను కట్టడి చేయచ్చని, ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో వినూత్నమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, మెగాస్టార్ చిరంజీవి సేవకు ప్రతిరూపమని, అటువంటి మెగాఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుని అభిమానులంతా తోచిన రీతిలో సేవామార్గంలో వెళ్తున్నామని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే మా అభిమానుల ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ముఖ్య నాయకులు, జనసేన యువ నాయకులు లోపింటి కళ్యాణ్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్, రవిరాజ్ చౌదరి, సాయి కుమార్, సూరిబాబు, ఉదయ్ కుమార్, మురారి, నలమారాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.