జనసేన ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: బ్రహ్మసముద్రం మండలం, బ్రహ్మసముద్రం పంచాయితీలో బూత్ నెంబర్ 26, 27, 29 వార్డుల్లో కొత్తగా, మొదటిసారిగా నమోదు అయిన ఓటర్లకు, ఓటు హక్కు కల్గిన యువతకు స్థానిక టిడిపి నాయకులతో కలిసి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి రెండు పార్టీల పొత్తు ఆవశ్యకత గురించి, రెండు పార్టీల మేనిఫెస్టో అంశాల గురించి, విలువైన ఓటు హక్కు వినియోగం గురించి యువతకు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ సూచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.