మత్స్యకార గ్రామాల్లో పితాని పర్యటన

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కట్రేనికొన మండలం, బలుసుతిప్ప పంచాయతీ, మాగసాని తిప్ప గ్రామంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణతో ఈ సందర్భంగా మాగసానితిప్ప గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్ కి సంబంధించి 12 నెలలకి ఇవ్వాల్సిన నష్టపరిహారం 4 విడతలు పరిహారం 46 ఆరువేల రూపాయలు పరిహారాన్ని 2 విడతలే ఇచ్చారని, అందులోనూ ఆ గ్రామంలో 90 కుటుంబాలకి పరిహారం అందలేదని మరియు అదేవిధంగా వేట నిషేధం టైంలో కూడా రావాల్సిన డబ్బుల్లో కూడా 10,000 కొంతమందికి అందడం లేదని చాలా మత్స్యకార గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సమస్యను జిల్లా కలెక్టర్ మరియు ఫిషరీస్ ఉన్నత అధికారుల వద్దకు తీసుకెళ్తానని లేని పక్షంలో సమస్యపై జనసేన తరపున పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెమ్మాడి గంగాద్రి, సంగాని ధర్మారావు, ఓలేటి శ్రీను, సంగాని శ్రీను, పెమ్మాడి శ్రీను, దూడల స్వామీ, సంసాని పాండురంగారావు, మేడా కృష్ణ, గోవిందు, పిల్లి గోపి, గిడ్డి రత్నశ్రీ, బీమాల సూరి, బొక్క శ్రీను, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.