ఓ నాయి బ్రాహ్మణుడా మేలుకో: చందు తాతపూడి

వచ్చిన ప్రభుత్వాలు కేవలం మనల్ని నమ్మించి మోసం చెయ్యడం తప్ప మనకి ఏ విధమైన న్యాయం జరగలేదు రాబోయే రోజుల్లో నాయి బ్రాహ్మణ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అది కేవలం ఒక జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కృష్ణాజిల్లా, గుడివాడలో ఆయన ఇచ్చిన వాగ్దానం చట్టసభల్లోకి నాయి బ్రాహ్మణులను తీసుకెళ్తానని నాయి బ్రాహ్మణ సమస్యలు తెలపటానికి ఒకరు చట్టసభల్లో ఉండాలని అది వైయస్సార్ పార్టీలో చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్న ఈ నాయి బ్రాహ్మణులు ఇప్పుడైనా మేలుకోండి అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ప్రతి దేవాలయాల్లో ఒకరిని బోర్డు మెంబర్గా నియమించాలని గవర్నర్ చేత ఆర్డినెన్స్ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి సాధారణ దేవాలయాలకు పరిమితి అయిపోయింది. ఇప్పటికే కమిటీలు వేయడం జరిగింది ఇక కార్పొరేషన్ పరిస్థితి అయితే మనం చెప్పుకునే అవసరం లేదు. ఈ నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ వచిన్న మూడు సంవత్సరాల్లో కార్పొరేషన్ లో ఎటువంటి నిధులు లేవు అలాగే జగనన్న చేదోడు పేరుతో నాయి బ్రాహ్మణులను మళ్లీ మోసగించిన జగన్ కేవలం షాపు యజమానికి మాత్రమే పదివేల రూపాయలు ప్రకటించిన జగన్, షాపుల్లో ఉండే నాయి బ్రాహ్మణులు వారు నాయి బ్రాహ్మణులు కాదా..? అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఇప్పటికీ పాత నాగరికతతోనే మీరాశి చేస్తూ, సంవత్సరానికి ధాన్యం తీసుకుని వారి కడుపు నింపుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి నాయి బ్రాహ్మణులకు కూడా ఈ పథకం వర్తించలేదు మరి వాళ్ళందరూ ఎవరు కేవలం షాపు ఉన్న యజమానికి మాత్రమే పదివేల రూపాయలు పథకాన్ని పెట్టి నాయి బ్రాహ్మణని ఎంత మోసం చేస్తున్నారో ప్రతి నాయి బ్రాహ్మణుడు గ్రహించాలి. మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియజేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించే దిశగా నాయి బ్రాహ్మణ ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మన నాయి బ్రాహ్మణ సంఘాలు కూడా అందరూ తరలిరావాలని కోరుకుంటున్నానని జనసేన నాయకులు, ఏలూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి చందు తాతపూడి అన్నారు.