ఉప్పుటేరు గ్రామంలో జనం కోసం జనసేన 102వ రోజు

పోలవరం: కుక్కునూరు మండలం, ఉప్పుటేరు గ్రామంలో 102వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. చిర్రి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో చివర ఉండే మండలం కుక్కునూరు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక్కరి సమస్య కూడా తీర్చలేకాపోయారని, 5ఏళ్లలో ఆయన కుక్కునూరు మండలానికి చేసిన అభివృద్ధి ఒక్కటి చెప్పాలని ప్రశ్నించారు. ఈ మండలంలో నిర్వశితులు సంఖ్య ఎక్కువ, కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదలు జరగడం, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే దగ్గర్లో పెద్ద ఆసుపత్రి లేకపోవడం, నిర్వశితులకు రావలసిన నష్టపరిహారం విషయంలో, ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం మోకాలు అడ్డుపెడుతుందని, అసలైన నిర్వశితులకు అన్యాయం జరుగుతుందని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే భాద్యత జనసేన పార్టీ తీసుకుంటుందని, నిర్వశితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, వారి కోసం ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని, అలాంటి వ్యక్తి అడుగు జాడల్లో నడిచే మాకు అవకాశం ఇస్తే నియోజకవర్గ, మండలాల్లో, గ్రామాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని ఏర్పారుస్తామన్నారు. కళ్యాణ్ గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టో వివరిస్తూ, గాజుగ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములిశెట్టి యుగేందర్, గోపాల్ కృష్ణ, తాండ్ర రవి, చల్లా కోటి, గంధం నాగరాజు, ఆవుల శ్రీను, కుక్కునూరు సీతారామయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.