విశాఖ ఉక్కు పరిరక్షణ లో మేము సైతం: గుడివాడ జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని గుడివాడ జనసేన పార్టీ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు

గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రాణార్పణ తో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేసే వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాడతామని బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్ కె, కొదమ గంగాధర్, లక్ష్మీకాంత్, జేమ్స్, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.