వేములవాడ గ్రామంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం

కాకినాడ: జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా శనివారం కరప మండలం, వేములవాడ గ్రామంలో స్థానిక నాయకులు మీసాల రాంబాబు, అప్పనపల్లి మహేష్, శ్రీపాదం కృపాదానం, మీసాల శ్రీను, తలాటం వెంకటేశ్వరరావు, నక్క శ్రీనివాస్ మరియు వేములవాడ జనసైనికుల ఆధ్వర్యంలో
ప్రజా సమస్యలు తెలుకోవడానికి ఈబీసీ కాలనీ, ఆంజనేయ స్వామి గుడి విధి, పోలీనాటి పేట, రామాలయం విధి ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి గ్రామంలో మహిళలు, ప్రజలు అనేక సమస్యలు తెలిపారు.. రైతులకి సరైన సమయంలో నీరు ఇవ్వడం తెలియదు పవన్ కళ్యాణ్ గారిని నిందించడం మాత్రమే తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వనికి, గ్రామంలో పన్నులు కట్టించుకునే అధికారులకి రోడ్లు, డ్రైనేజీ లు పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మించడం లేదో అర్ధం కావడం లేదు. అధికారులు బాధ్యత లేకుండా, వైసీపీ వాళ్ళకి వత్తాసు పలకడం చాలా దారుణం, ఈ గ్రామంలో సుమారు 300 మంది నిరుద్యోగ యువత ఉన్నారు అంటే వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను ఎంత చిన్న చూపు చూస్తోందో తెలుస్తోంది అని, వారానికి ఒకసారి మాత్రమే బజారు నిర్వహించడం చాలా దారుణం అని త్వరలో విటన్నిటికీ మంచి పరిష్కారం చూపే ప్రజా ప్రభుత్వం రాబోతుంది. ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.