14,15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలి: జనసేన మురళి

అనంతగిరి: 14,15 ఆర్థిక సంఘం నిధులు లేక జ్వరాలతో గిరిజన ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని జనసేన మురళి మండిపడ్డారు. శనివారం జనసేన మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పంచాయతీ నిధులు ప్రభుత్వం దోచుకోవటం మూలన గ్రామాలలో దోమలు బారినపడి వ్యాధులకు గురవుతున్నారు. ఆర్థిక సంఘం నిధులు లేక గ్రామ ప్రజలకు సమాధానం చెప్పలేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీధి దీపాలు లేక రాత్రిపూట ప్రజలు బయట రావట కష్టంగా ఉంది. గిరిజన గ్రామలలో వీధి దీపాలు లేక గిరిజన ప్రజలు అడవుల నుండి జంతువులు గ్రామాలకు రావడం జరుగుతుంది బ్రిటిష్ కాలంలో వెలుగు లేని గ్రామము గిరిజన గ్రామాలు ప్రదర్శిస్తున్నాయి. రాత్రిపూట వీధి దీపాలు లేక క్రోమ్లోరో పిచకారి లేకపోవడం మూలమున బ్లీచింగ్ లేక దోమలు ఎక్కువ అవ్వటం మూలముగా గిరిజన ప్రజలు దోమకాటుకు గురి అయి మలేరియా డెంగ్యూ వంటి వ్యాధిన పడుతున్నారు అలాగే ఈగల వలన క్యాన్సర్ వ్యాధిన పడుతున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మండిపడ్డారు. మరియు గ్రామ పంచాయతీకి 14,15 ఆర్థిక సంఘ నిధులు లేక పంచాయతీల లో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన గిరిజన గ్రామాలకు సర్పంచులు అభివృద్ధికి ముందుకు చేసుకుని వెళ్లలేకపోతున్నారని. అలాగే గిరిజన గ్రామలలో మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. మంచినీటి అందించుటకు కూడా ఈ యొక్క 14,15 నిధులు లేకపోవడం మూలమున గిరిజనులు ఊట లో నీరుని తాగి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రవహించే గడ్డ నీరు మాత్రమే గిరిజనుల దాహం తీరుస్తుంది. గ్రామ పంచాయతీకి 14,15 ఆర్థిక సంఘ నిధులు మండలము లలో గిరిజన గ్రామాలకు ఎంతోకొంత మంచినీళ్లు మరియు రోగుల వ్యాధుల నుండి కొంత సహాయ పడేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి గిరిజన కుటుంబ లకు అన్యాయం చేస్తుంది ఇప్పటికైనా 14,15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ వారిగా కేటాయించకపోతే ప్రతి పంచాయతీ ప్రజలతో మండలంలో మహా ధర్నా కార్యక్రమం చేపడతామని జనసేన మండల నాయకులు మురళి తెలిపారు. మన్యం ప్రాంతంలో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మౌలిక వసతులు కోసం గిరిజనులు వేచి చూస్తున్నారని అభివృద్ధికి చాలా గ్రామాలు దూరంగా ఉన్నాయని, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజన గ్రామాలలో ఉన్న యువతను ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అలాగే నాన్ షెడ్యూల్ పంచాయతీలో ఉన్న భూములు క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని అమాయక గిరిజనులను మాయ మాటలు చెప్పి విలువైన భూములను మధ్యలో ఉన్న మధ్యవర్తులు కారుచౌకగా భూస్వాములకు రైతుల దగ్గర తీసుకున్నా ఏం చేస్తున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు మండలంలో నిలిచిపోయిన వివిధ రోడ్డు పనులను వెంటనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు పాతకోట, రేగం, రింగ్ రోడ్, అలాగే కుంభర్తీ, పట్టి, రింగ్ రోడ్, బొంగిజా రింగ్ రోడ్, ఓనుకొండ రింగ్ రోడ్ ను. తదితర గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లను పూర్తిస్థాయిలో తీసుకురావాలని ఆయన వ్యక్తం చేశారు.