గొర్రిపూడి గ్రామంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం

జనం కోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరప మండలం, గొర్రిపూడి గ్రామంలో స్థానిక నాయకులు పుణ్యమంతుల అన్నవరం, అనుకుల రాంబాబు, గండి యారీష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుకోవడానికి ఎస్సీ పేట అరుంధతి కాలనీ, న్యూ కాలని మరియు అగ్నికుల క్షత్రియ కాలని ప్రాంతాలలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ సామజిక వర్గాలకు చెందిన వైసీపీ, టీడీపీ నుండి సుమారు 15 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఆ ప్రాంత ప్రజలు త్రాగు నీరు సరిగా అందడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, ఎస్సీ, ఓసి లకు చెందిన స్మశానంభూమి కబ్జాకి గురిఅయినది అని, శానిటేషన్ సరిగా లేదని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. త్వరలో విటన్నిటికీ మంచి పరిష్కారం లభిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాబోతుందని, ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.