జగన్ పై యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో రేచర్ల పేట ప్రాంతంలో పచ్చిపాల కోడిశ్రీను ఆధ్వర్యంలో దళితుల పధకాలు తీసేసిన జగన్ పై యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్.సిలు, నా ఎస్.టిలు, నా బి.సిలు అని అంటూ ఊదరగెట్టే కబుర్లు చెపుతూ మభ్యపెత్తి మోసం చేస్తున్నారనీ, అంబేడ్కర్ విగ్రహం పెట్టారు చాలా సంతోషం అభినందనీయమనీ, అంతటితో కడుపు నిండిపోతోందంటున్న మీ మాటలను ఖండిస్తున్నాము. మీరు అధికారంలోకి వచ్చాకా 27 దళితుల పధకాలను రద్దుచేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి దళితులందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి సభపెట్టి సిద్ధం అన్నారనీ అందుకు ప్రతిగా మిమ్మల్ని దింపడానికి కాకినాడ సిటి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారనీ ముఖ్యంగా కాకినాడలోని దళితులు మొత్తం మీకు దూరమయ్యారనీ 15 సంవత్సరాల క్రితం జగన్ దివంగత తండ్రి హయాములో కట్టిన భవనం తప్ప ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలలో ఏంచేసారో తెలపాలని డిమాండ్ చేసారు. నగరానికి దూరంగా ఎక్కడో ఇళ్ళు ఇస్తున్నామన్నది తప్ప ఇంకేం చేసారన్నారు. నగరంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని తూర్పారబట్టారు. దళిత డ్రైవర్ని చంపి ఇంటికి పార్సెల్ పంపిన ప్రభుత్వం మీదన్నారు. డాక్టర్ సుధాకర్ విషయం కానీ, ప్రసాదు శిరోముండనం కానీ ఇలాంటివి మీ హయాములో కోకొల్లలన్నారు. మీరు దళితులని అవసరానికి వాడుకుని ముంచేయడం తప్ప చేసిందేమీలేదని దెప్పిపొడిచారు. దళితులందరూ కూడా బటన్ నొక్కి నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, బొడ్డుపల్లి వరప్రసాద్, శ్యాంబాబు, కిసిపెల్లి ప్రసాద్, ప్రదీప్, నాగేంద్ర ప్రసాద్, సత్య, వెంకటరమణ, శిరీష, గౌతమి, రమణమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.