కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో యుద్ధానికి మేము సిద్ధం

  • ఇంటి పన్నుల విధానాన్ని వ్యతిరేకించే యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో స్థానిక 28వ డివిజన్ తిలక్ వీధి నందు ప్రతి సంవత్సరం పెంచే ఇంటి పన్నుల విధానాన్ని వ్యతిరేకించే యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పాటిస్తూ పాల చేయాలనీ, ప్రజలు ప్రభుత్వాలని ఎన్నుకునేది అభివృద్ధి చేయడానికి తద్వారా వచ్చే ఫలాలను క్రమ పద్ధతిలో పొందడానికన్నారు. అంతే కానీ ఇలా ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు దారుణంగా పెంచేస్తూ ఇల్లు ఎందుకు కట్టుకున్నామురా దేవుడా అని గుండెలు బాదుకోడానికి కాదనీ, అయినా ఈవ్యాపార ధోరణి ఏంటో ఈ వై.సి.పి ప్రభుత్వానికి అని అంటూ అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలన అంటే తెలుసా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఆస్థిపన్ను పైన ప్రజలను చైతన్యపరుస్తూ పాంఫ్లెట్స్ ను ఇంటి ఇంటికీ ఇస్తూ ప్రచారం సాగించారు. ప్రజలు చాలు ఈ వై.సి.పి పాలన వీళ్ళను ఇంటికి పంపేందుకు మేము సిద్ధం అని అంటున్నారనీ, త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో మెరుగైన పాలన పొందవచ్చని ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వాసంశెట్టి శ్రీను, సుంకర రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, పాలిక శివ, చీకట్ల వాసు, వాసిరెడ్డి సుబ్బారావు, నగేష్, సతీష్ కుమార్ సమీర్, బండి సుజాత, బట్టు లీల, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, హైమావతి, సత్యవతి, రమ్య, మరియా, రత్నం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.