వైసీపీ రాక్షస పాలనను ఖండిస్తున్నాం

  • కళ్యాణదుర్గం జనసేన నాయకులు

కళ్యాణదుర్గం: గత 4 రోజుల నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వాలంటీర్లు చేపట్టిన నిరసనలను తీవ్రంగా ఖండిస్తూ శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో టీ సర్కిల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు “పాలాభిషేకం” చేయవలసిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడం జరిగింది. ఈ చర్యను జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, జిల్లా సెక్రెటరీ లక్ష్మీ నరసయ్య, జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, 5 మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, జయకృష్ణ, చంద్రమౌళి, కాంత్ రాజ్, జాకీర్ మరియు కళ్యాణదుర్గం నాయకులు వీర మహిళ షేక్ తార, ముక్కన్న, రాయుడు, తిప్పెరుద్ర, మహేష్, గోవిందు, శివ రుద్ర, ధనంజయ, నరేష్, నితిన్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.