నగర ప్రజల ఇబ్బందుల్లో భాగస్వామ్యం అవ్వాలి: రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, శనివారపు పేట 26 వ డివిజన్ లో నగర ఉపాధ్యక్షులు సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ శనివారపు పేట గ్రామపంచాయతీ 26వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరనీడి ప్రసాద్, తోట దుర్గాప్రసాద్, గెడ్డం చైతన్య, శివ శంకర్, ప్రియాంక, మంగరాజు, కృష్ణ మరియు రాజేష్ వారి కమిటీ ఆధ్వర్యంలో వేసవికాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. రేపటి నుంచి మంచినీటి చలివేంద్రం అనేది వేసవికాలం అంతా నిరంతరం ఉంటుంది. వేసవి కాలంలో దాహాన్ని తీర్చేందుకు జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలకి చేరువగా ఉండాలి. నగర ప్రజల ఇబ్బందుల్లో భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచనతోనే ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. రేపటి నుంచి చలివేంద్రం ఇక్కడ కంటిన్యూషన్ గా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 26వ డివిజన్ కమిటీ పెద్దలందరికీ ఏలూరు నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, ఆర్గనైజింగ్ సభ్యులు కల్కి రమేష్, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, పవన్ కుమార్ మరియు 26 వ డివిజన్ నాయకులు సమ్మెట్ల కృష్ణ, కొండేటిరమేష్, అనుకొండ సూర్య, అంజనీ కుమార్, ఈశ్వర్, రాధమ్మ, అడపా భాను, పేరక నాగేశ్వరరావు, పుప్పాల మురళి, మురళీధర్, జస్వంత్, చైతు, రాంపండు, వరికూటి కృష్ణ, మోహన్ ఫణి ఇంద్ర, తరుణ్ కుమార్, ప్రమోద్, శరత్, ఆటో రంగారావు, జిల్లెల నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు.