నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: అతికారి దినేష్

రాజంపేట, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ సమన్వయ కర్త అతికారి దినేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలుపుటకు నాదెండ్ల మనోహర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అక్రమ అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటునన్నారు. జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టుతామని ఎంత చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు వినక అక్రమ అరెస్టులు చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు కూడా మాకు లేదా? అంటూ ప్రశ్నించారు. నాదెండ్లని అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని రాజంపేట నియోజకవర్గం జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు అతికారి దినేష్ డిమాండ్ చేశారు.