సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అప్రజా స్వామిక సంఘటనకు కారకులైన వారిని తక్షణమే గుర్తించి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. జయరాం రెడ్డి ఆదివారం మీడియా ముఖంగా మాట్లాడుతూ.. సాక్షాత్తు సీఎం పైనే రాళ్ల దాడి చేసి హతమార్చాలనుకున్నారంటే? సామాన్య ప్రజలకు రాష్ట్రంలో భద్రత ఉందా? ఈ సంఘటన ద్వారా రాష్ట్రంలో “లా అండ్ ఆర్డర్” పూర్తిగా చీయించిపోయింది అనేది స్పష్టంగా అర్థం అవుతున్నది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగడానికి అనర్హుడని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైపోయింది. తక్షణమే ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర డిజిపి, ఇంటెలిజెన్స్ అన్ని భద్రతా విభాగాలకు చెందిన అధిపతులు పదవుల నుంచి వైదొలగాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైసీపీ మంత్రులు, నాయకులు కొంతమంది అధికారంలో మేమున్నాం, ఈ సంఘటనకు నైతిక బాధ్యత మీమే వహించాలని విచక్షణ మరిచి, ప్రతిపక్ష నాయకులైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బిజెపి పార్టీని ఎన్.డి.ఏ కూటమి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారి రాష్ట్రంలో వైసిపి పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలారా మీరందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి. గతంలో కూడా చూసాం కోడి కత్తి సంఘటన, వివేకానంద రెడ్డి హత్య సంఘటనల అంశాన్ని వాడుకొని 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన విధంగానే నేడు కూడా మరొక మారు అధికారంలోకి రావాలని చూస్తున్నారేమో!! అని రాష్ట్ర ప్రజలు భావించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సంఘటనకు పాల్పడిన వారిని గుర్తించి వారి పైన తగిన చర్యలు తీసుకోకుండా? ప్రతిపక్షాలను విమర్శించడం దారుణమైన దుర్మార్గమైన, నీచమైన, పిరికి చర్యగా మేము భావిస్తున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తున్నాం. ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే రాష్ట్ర డి జి పి పైన ఇంటెలిజెన్స్, అన్ని భద్రత విభాగాలకు చెందిన అధిపతుల పైన తగిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.