వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: చింతా సురేష్ బాబు

జనసేన రైతు భరోసా యాత్రపై వక్రీకరించి మాట్లాడిన కర్నూల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే లు ప్రెస్ మీట్ లో నోరు జారీ మాట్లాడడం తగదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 132 మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన మా నాయకుని అభినందించక పోగా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైఖరిని ఎండ గడుతూ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి చింతా సురేష్ బాబు మండిపడ్డారు.. అలాగే ఆయన మాట్లాడుతూ.. మీకు చేతనైతే కర్నూల్ ని అభివృద్ధి చేసి చూపించండి. ఇప్పుడు మా జనసేన పార్టీ ఆదుకున్న కౌలు రైతులకు మీరు కూడా ప్రభుత్వం తరఫున ఆనాడు ఇచ్చిన ఆ మాట ప్రకారం చనిపోయిన వారికి ఆర్థికంగా అండగా ఉంటామన్న మాట నిలబెట్టుకుని ఏడు లక్షల ఆర్థిక సాయం చేసి మీ చిత్తశుద్ధిని రూపించుకోండి. అప్పుడు మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. మీరు కేవలం ఓడిపోతామనే భయంతో ప్రజల్లో జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి భయం పట్టుకొని నిరాధారమైన ఆరోపణలతో మాట్లాడుతున్నారు. దీనికి 2024లో జరిగే ఎలక్షన్లలో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మీ పసలేని ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని చింతా సురేష్ బాబు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ వీర మహిళ కమిటీ సభ్యురాలు హసీనా బేగం, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి విశ్వనాథ్, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి తెలుగు గోవింద రాజు, బజారి, సుధాకర్, రాంబాబు, శ్రీనివాస్ గౌడ్, హుస్సేన్, షబ్బీర్, కొండల్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.