అదినాయకుల అడుగుజాడల్లో నడుస్తాం: ఆలమూరు జనసేన అధ్యక్షుడు సత్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొత్తపేట నియోజకవర్గం జేఎస్పీ అధినేత శ్రీ బండారు శ్రీను అడుగుజాడల్లో నడుస్తూ ఆలమూరు మండలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆలమూరు మండల జనసేన అధ్యక్షుడు సూరపరెడ్డి సత్య అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేటలో బుధవారం జనసేన అధ్యక్షుడు శ్రీ బండారు శ్రీను నేతృత్వంలో ఇటీవల నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులతో కార్యకర్తల పరిచయ సమావేశం నిర్వహించారు. కొత్తపేట నియోజక వర్గ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను అభినందించి, జనసేన పార్టీని మరింత బలంగా జనంలోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, చెముడులంక ఎంపీటీసీ తమ్మన భాస్కర్రావు, పడాల అమ్మిరాజు, వై సాయి కిరణ్, బి తాతాజీ, జనసేన పార్టీ ఆలమూరు మండల నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.