గజపతినగరంలో జనసేన జెండా ఎగరవేస్తాం

  • దత్తిరాజేరు మండల జనసేన ఆత్మీయ సమావేశం

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరం జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో దత్తిరాజేరు మండల జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ.. పల్లె పల్లెకు జనసేన రెండో విడత కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజలను కలిసి, సమస్యలు తెలుసుకొని, విధంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. త్వరలో ఎలక్షన్ నేపథ్యంలో జనసైనికుడు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పని చేయాలని తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలో ఈసారి జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు అడ్డడ మోహన్ రావు, రమేష్ రాజు దంతులూరి, డా.రవి కుమార్ మిడతాన, గజపతినగరం మరియు దత్తిరజెరు మండల నాయకులు పండు, ఆదినారాయణ, శ్రీను, మహేష్, సామిరెడ్డి లక్ష్మణ్, బెజవాడ అనిల్, చరణ్, సూర్య, మురళి, అశోక్, అప్పరావు, సత్యనారాయణ సైనికులు నాయకులు పాల్గొన్నారు.