పెనుమూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

  • జనసేన ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పెనుమూరు మండలం, ఏనుగు కొండయ్య పల్లి గ్రామంలో జనసేన ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డా. యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభ మహోత్సవానికి ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. వెంటనే జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు పెనుమూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేసారు. మొదటి సంవత్సరంలోనే 40 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ఒకసారి జనసేన తెలుగుదేశానికి అవకాశం ఇవ్వండని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏనుగు కొండయ్య పల్లి గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీలోని అజెండాను ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాల ద్వారా తెలియజేశారు. కలివిడిగా ప్రజలతో మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి భాను ప్రసాద్, పెనుమూరు మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, మండల కార్యదర్శి శేఖర్, మండల యువజన అధ్యక్షులు గురు ప్రసాద్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్ తద్తరులు పాల్గొన్నారు.