నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన గెలుపే దిశగా ముందుకు వెళతాం

  • బిసి లకు, బహుజనులకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి
  • 5రూపాయల భోజనం పేదల ఆకలి తీర్చడం కోసమా? పేదల ఓట్ల కోసమా??
  • టాంక్ బండ్ కు రంగులేసి నియోజకవర్గం అభివృద్ధి అనడం సిగ్గు చేటు
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు కాకుండా నాగర్ కర్నూల్ ఎమ్ అభివృద్ధి జరిగింది?
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది బిసిలకు, బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చారు?
  • వంగ లక్ష్మణ్ గౌడ్ గారు

తెలంగాణ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పెద్ద కొడుకు అని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని సొంతంగా ఎమ్ అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో చేసింది. టాంక్ బండ్ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోనీ ప్రజల డబ్బుతో చేసింది.. మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం కంపెనీల డబ్బుతో కట్టించారు. మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకు వచ్చాయ్ టాంక్ బండ్ లు పక్క జిల్లాలకు కూడా వచ్చినయ్, ప్రత్యేకించి నాగర్ కర్నూల్ కు జరిగిన అభివృద్ధి ఎంటి..?? నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అధికార పార్టీకి ఒకటే సవాల్ విసురుతున్న, డబ్బులు పంచకుండా, బీరు బిర్యానీ లేకుండా, జనసేన పార్టీ తో డీ కొట్టగలిగే దమ్ము అధికార పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారికి ఉందా.! బతుకమ్మకు 300, బొనానికి 400.. ఇలా తెలంగాణ సంప్రదాయాలను కూడా డబ్బుతో కొనాలి మీ యొక్క అహంకార పుర్వితమైన నియంత పాలనకు విముక్తి జనసేన పార్టీ తోనే సాధ్యం. పక్క పార్టీల్లో ఉన్న కార్యకర్తలను, నాయకులను ఆశ చూపిస్తూ కొత్త పార్టీలు వస్తాయి అని మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మీరు మొదట టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు మీకు డిపాజిట్ కూడా దక్కలేనటువంటి పరిస్థితి. అప్పుడే మర్చిపోయారా అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, బైరపోగు సాంబ శివుడు, పి.అర్ రాఘవేంద్ర, ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి, ఎదుల శరత్ గౌడ్, మహేష్ గౌడ్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, ఆరిఫ్, గద్వాల్ మహేష్, మహేష్, చేన్నమోని మహేష్, బాల్ రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.