రోడ్ల మరమ్మత్తులు చేపట్టని తరుణంలో నిరసన ఉద్రిక్తం చేస్తాం

అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, పాడేరు మండలం, ఇరాడపల్లి పంచాయతీ, ఎస్.బొడపుట్టు గ్రామంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సందర్శించి గ్రామంలో పలు సమస్యల గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అలాగే గ్రామస్తులు, గెమ్మలి జగపతి బాబు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదని అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కొట్టగిల్లి భాగ్యలక్ష్మికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు మారిన మా గ్రామాన్ని పట్టించుకోని అధికారులు లేరు, కాబట్టి సమస్యల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ మాట్లాడుతూ… గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకి మీకు ఓట్ల కోసం అధికారం కోసం మాత్రమే గ్రామాల్లో పర్యటించి ఓట్లు అడిగిన మీకు ప్రజలు సమస్యలు కోసం ఎందుకని పరిష్కరించడంలో విఫలం చెందుతున్నారు. ఇక్కడ సందర్శిస్తే గ్రామంలో ఉన్నట్టు వంటి రోడ్ల మరమ్మత్తుల, వల్ల గర్భిణీ స్త్రీల, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అలాగే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే గ్రామస్తులకు రోడ్ల మరమ్మత్తులు చేపట్టని మరుక్షణం మేము ఐటిడిఏ నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన ఉద్రిక్తం చేస్తామని జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ తెలిపారు. అలాగే గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ, జనసైనికులు, గెమ్మెలి రాజు, జగపతి, మత్యరాజు, సురేష్, అలాగే గ్రామస్తులు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.