జనసేన – టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాం

నెల్లూరు: జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ వి ఆర్ కన్వెన్షన్ లో మంగళవారం జనసేన పార్టీ జిల్లా నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముఖ్యంశాలు.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించారు. ఇందులో 94 స్థానాలకు చంద్రబాబు నాయుడు టీడీపీ తరుఫున అభ్యర్థులను ప్రకటించగా.. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసేన తరుఫున ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే మొత్తానికి జనసేన పార్టీ 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. కేవలం 24 సీట్లు కేటాయించడంపై జనసేన పార్టీ శ్రేణులకు కొంతవరకు బాధ కలిగినా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర ప్రజల కోసం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకు మేము కూడా కట్టుబడి ఉంటాము. జనసేన టిక్కెట్‌ పొందిన ప్రతీ అభ్యర్థి విజయానికి సహాయపడుతూ.. అలాగే మాకు కేటాయించిన సీట్లలో 98% స్ట్రైక్ రేట్ సాధించడం, వైస్సార్సీపీ పార్టీని ఓడించడం జనసైనికుల ప్రథమ లక్ష్యం. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి పార్టీ సభ్యులమైన మేము మనస్పూర్తిగా మద్దతిస్తున్నాము. క్రమశిక్షణ కలిగిన సైనికులుగా ఈ ఎన్నికల యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలని నిర్ణయించుకున్నాము. ఈ కీలక తరుణంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు, సానుభూతిపరులు అందరూ ఏకతాటిపై నిలబడి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. జనసేన – టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట ఇన్చార్జ్ ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రాజేష్, జనసేన వీరమహిళ నాయకురాలు నాగరత్నం యాదవ్, కోవూరు టేకర్ గుడిహరి రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం కేర్ టేకర్ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన సీనియర్ నాయకులు రవి, శేఖర్ రెడ్డి, జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ ఇంచార్జ్ ఈగి సురేష్, ఉదయగిరి కేర్ టేకర్ కాశి, వెంకటగిరి నాయకుడు తోట కిష్టయ్య, జనసేన వీరమహిళలు కృష్ణవేణి, సుకన్య, నందిని, హసీనా, నిర్మల, ఇందిరా, కస్తూరి తదితరులు పాల్గొన్నారు.