నాదెండ్లకు ఘనస్వాగతం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలపర్రు టోల్ గేట్ వద్ద జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, నగర కమిటీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.