పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిన మహేష్ కు కేటాయించాలి: పోతిన మహేష్

విజయవాడ: జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి 40వ డివిజన్ కోఆర్డినేటర్ న్యాయవాది ఎం హనుమాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిన మహేష్ గారి లాంటి చదువుకున్న వ్యక్తికి కేటాయిణాలని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మీరు పొత్తులకు సిద్ధమయ్యారు. టిడిపి జనసేన బిజెపి పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థాపించాలని కోరుకున్నారు. కానీ పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిన మహేష్ గారి లాంటి చదువుకున్న గత తొమ్మిది సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా నిలిచి పశ్చిమ నియోజకవర్గం ఏ టీడీపీ బీజేపీ నాయకుడు చేయని విధంగా వైసీపీ ఖండించిన ఏకైక వ్యక్తి పోతిన మహేష్. ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థుల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దిన వ్యక్తి అలాంటి వ్యక్తికి సీటు కేటాయించలేక పోతే.. నిజంగానే మీరు ఎన్ని పొత్తులతో వచ్చినా యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దయచేసి అలాంటి వ్యక్తికి సీటు కేటాయించి అసెంబ్లీకి పంపిస్తే యువత భవిష్యత్ బాగుపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి దయచేసి ఒక సీటు జనసేన పార్టీ మహేష్ గారు కేటాయించవలసిందిగా మిమ్మల్ని శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము పశ్చిమ నియోజకవర్గం సీటు పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తే అత్యంత మెజారిటీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చే బాధ్యత పశ్చిమ ప్రజలు నాయకులు తీసుకుంటారని పోతిన మహేష్ పేర్కొన్నారు.