ఏ సామాజిక వర్గానికి ఏమి మేలు చేశారని ఈ యాత్ర: చొప్పా చంద్ర శేఖర్

శింగనమల: వైసీపీ పాలకుల మాటలు వట్టి నీటి మాటలు అని, సామాజిక సాధికారత అంటే సామాజిక వర్గాలను సాధించుకుని తినటం అని వైసిపి నాయకులు అనుకున్నట్టున్నారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికి ఏమి మేలు చేశారని ఈ యాత్ర. అసలు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరంలా ఏడు నెలల అయినా ఏ ఒక్క సామాజిక వర్గానికి ఏ విధంగానూ సహాయపడని వైసిపి పాలకులు కేవలం కార్పొరేషన్ ల పేరుతో కులాలను విడగొట్టి వారి వైసీపీ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు ఇచ్చి ప్రజల సొమ్ము వారి నాయకుల జేబులో పెట్టడం తప్ప ఏ కార్పొరేషన్ లో కూడా సామాన్య ప్రజానీకానికి వారి అభ్యున్నతికి ఒక్క రూపాయి లోన్లుగా ఇచ్చిన ఇచ్చిన పాపాన పోలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఏమి ఇవ్వలేకపోయారు. ఉన్న ఈబిసీ 5% రిజర్వేషన్ కూడా తీసేసి కాపులను నట్టేట ముంచారు. ఇక వెనుకబడిన బీసీ కులాలకు వారి కార్పొరేషన్ ల ద్వారా ఏ ఒక్క ప్రోత్సాహము అందించలేదు కదా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన దానిని చూపించి వారిని మోసం చేస్తున్నారు. ఇక ఎస్సీ మరియు ఎస్టీలకు ఈ వైసీపీ పాలకులు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు.కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు. కనీసం విదేశీ విద్య కున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని కూడా తొలగించి వీరు పేరు పెట్టుకున్నారు. మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు నే తొలగించారంటే వీరి అహంకార ధోరణి ఏ పాటిదో.. ఆలోచించండి. వీరివి నియంత పోకడలు.. అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు అల్లకల్లోలం చేశారు. ఇక మైనార్టీలను. నిరుద్యోగులను, కరువుతో అల్లాడుతున్న రైతులను. కార్మికులను, ఇక ప్రభుత్వ ప్రయివేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. కేవలం ఎన్నికలు సమీపిస్తున్నందున వీరి జిత్తుల మారి నక్క వేషాలతో మరలా పేద సామాజిక వర్గాలను మోసం చేసే కార్యక్రమం వీరి సామాజిక సాధికారత బస్సు యాత్ర. నిన్నటి రోజున సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రధాన రహదారికి అడ్డంగా సభా వేదిక వేసి ఆ దారిలో వెళ్లే ప్రయాణికులకు, ఆంబులెన్స్ లకు తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. గ్రామంలో కరెంటు లేకుండా చేసి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈ విధంగా బస్సు యాత్రలో వీరి బూటకపు బుస్సు మాటలు చెప్పారు. అసలు వీరిని జనసేన పార్టీ ముందే ప్రశ్నించింది. ఏ కార్పొరేషన్ ద్వారా ఏ సామాజిక వర్గానికి ఎన్ని వేలు ఇచ్చారో ఒక శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని తెలిపింది. ఇది చేతకాలేదు.. ఎందుకంటే కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఉంటే కదా ఆ సామాజిక వర్గాలకు చేయూత ఇవ్వడానికి.. పేరుకు మాత్రమే దళిత ఎమ్మెల్యే అయిన శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు నిన్న సమావేశమునందు మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము. సింగల్ గా వస్తాము. సినిమా వారు మా కు అవసరం లేదు అని తెలిపారు. అమ్మా తల్లీ.. సిమెంట్ కంపెనీల వారు, ఇసుక దోపిడీ వారు, ఎర్రచందనం మరియు ఎర్ర మట్టి దోపిడీదారులు చుక్కల భూములతో రైతులను బెదిరించే వారు.. చీప్ లిక్కర్ మద్యం వ్యాపారులు మాత్రమే ప్రజలు కాదు.. సినిమా వాళ్లు కూడా ప్రజలేనని తెలుసుకోవాలని జనసేన పార్టీ సూచిస్తుంది. పొత్తులు అనేవి రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలుసుకోవాలి. ఓటుకు నోటు ఇచ్చి అధికారంలోకి రావడం రాజ్యాంగ అనైతికం అని మీరు సమావేశంలో చెప్పాల్సింది. మేము వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుకు ఒక్క రూపాయి ఇవ్వకుండా గెలుస్తానని చెప్పి ఉంటే జనసేన పార్టీ మిమ్మలను ప్రశంసించేది. కావున నియోజకవర్గ ప్రజలు ఆలోచించవలసింది ఏమిటంటే అవినీతిపరులను అందలమెక్కిస్తే మన గతి అధోగతి పాలె అవుతుందని, కావున ఓటును నోటుకు అమ్ముకోకుండా నిజాయితీపరులకు పట్టం కట్టాలని జనసేన పార్టీ తరఫున సింగనమల నియోజకవర్గం ప్రజానీకానికి వేడుకుంటున్నాం …మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ అందరి యాత్రలు చెప్పుతూ తాను చేసిన దిగంబర యాత్ర ప్రజలకు తెలపటం మరిచినారు కావున.. ఈ వైసీపీ నాయకుల మాటలు నీటి మాటలు మాత్రమేనని తేటతెల్లమైంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే జనసేన తెలుగుదేశం పార్టీలతో కూడిన ఉమ్మడి ప్రభుత్వం తప్పనిసరిగా రావాలని పేద సామాజిక వర్గ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ వైసీపీ పాలకులు ఎన్ని జిత్తుల మారి నక్క వేషాలు వేసిన ఈసారి వీరికి ఓటమి తప్పదు.. తప్పదు ఇది ప్రజల నిర్ణయం అని చొప్పా చంద్ర శేఖర్ పేర్కొన్నారు.