ఉద్యోగులు సాధించిందేమిటి?

పెడన, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంపై నీళ్లు చల్లిన ఉద్యోగ సంఘ నాయకులు. ఎవరి స్వార్థం కోసం ఉద్యోగుల సమైక్యతను తాకట్టు పెట్టారో తెలియదు కానీ, ఉద్యమ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులకు సాధించిపెట్టింది ఏమిటి? మట్టి ఖర్చులు తప్ప. ఫిట్మెంట్ పెంపు లేకుండానే ఒప్పందం చేసుకున్నాని, హెచ్ ఆర్ ఎస్ స్లాబులతో గ్రామీణ ప్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, పాలకుల పాదాల ముందు దళారి నాయకులు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని, ఉద్యోగులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారంటే ఉద్యోగులు ఎంత నిరాశతో ఉన్నారొ అర్థమవుతుంది. ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి లొంగిపోయారని, నమ్మిన వారిని నట్టేట ముంచారని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల హక్కుల సాధనలో వైఫల్యం చెందారని ఉద్యోగులు భావిస్తున్నారు. సిపిఎస్ ప్రస్తావన లేదు. గతంలో 27 శాతం ఐఆర్ ను, 23 శాతానికి ఫిట్మెంట్ కుదించడం వల్ల, నాలుగు శాతం ఉద్యోగులు నష్టపోతున్నారు. అంతేకాకుండా 20 శాతం ఉండవలసిన హెచ్ ఆర్ ఎ ను, 16 శాతానికి తగ్గించడం వల్ల మరో నాలుగు పర్సెంట్ నష్టపోతున్నారు. డీఎ బకాయిలను ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తానని చెప్పడం, సరైన విధి విధానాలు లేకపోవడం ఉద్యోగులను అసంతృప్త పరిచింది. పెన్షనర్లకు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడం సరికాదు. వారి న్యాయమైన కోర్కెలను తీర్చాలి. అస్పష్టమైన విధానాల వల్ల ఉద్యోగులు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి విధానాల పై స్పష్టత ఇవ్వాలని పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు ఎస్.వి బాబు సమ్మెట అన్నారు.