కొత్తగుంట స్మశానానికి మోక్షం ఎప్పుడు?: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న కొత్తగుంట స్మశానానికి మోక్షం ఎప్పుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ప్రశ్నించారు. బుధవారం సర్వేపల్లిలోని ఐదు కులాల వారు వినియోగించుకునే కొత్తగుంట స్మశానాన్ని బొబ్బేపల్లి సురేష్ జనసేన నాయకులతో పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామపంచాయతీ నందు ఐదు కులాలవారు వినియోగించుకునే కొత్త గుంట స్మశానానికి మోక్షం ఎప్పుడు. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని స్మశానం ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులకి వినతి పత్రాల రూపంలో విన్నవించుకున్నా ఎవరూ కూడా గ్రావెల్ తోలిచిన పరిస్థితులు లేవు. వర్షాకాలంలో వర్షపు నీటితో నిండిపోతే శవాన్ని తీసుకెళ్లి పుడ్చు కోవాలంటే మోకాల్లోతు నీళ్లలో వెళ్ళే పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు కరుణించండయ్యా. సర్వేపల్లి గ్రామపంచాయతీలో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరిగిన పరిస్థితి లేదు. కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ మాత్రం దోచుకుపోతున్నారు. కానీ మంత్రి అండదండలతో గ్రామాలలో అభివృద్ధి మాత్రం జరగలేదు. దానికి నిదర్శనం కొత్త గుంట స్మశానం. సిమెంట్ రోడ్లు అయితే వేసుకుంటారు ఆదాయాలు వస్తాయని మిగిలిన ఏ విషయాన్ని పట్టించుకోరు. గ్రామపంచాయతీలో నిధులు లేవు ఉన్న నిధులు వాళ్ల స్వార్థాలకు వినియోగించుకునే దానికి మాత్రం సరిపోతున్నాయి. ఎవరైనా అడిగితే వారిపై అక్రమ కేసులు పెట్టే పరిస్థితి. ఈ విషయంపై మేము ఒకటే తెలియజేస్తున్నాం. మా కొత్తగుంట స్మశానానికి గ్రావెల్ తోలించకపోతే జనసేన పార్టీ ఉద్యమం చేస్తాది.
ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సర్వేపల్లి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు సుమన్, చిన్న, రహీం తదితరులు పాల్గొన్నారు.