డంపింగ్ యార్డ్ ని ఎప్పుడు తరలిస్తున్నారు?

  • జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఎన్నికల ముందర అనంత నగర ప్రజలకు ప్రధాన హామీగా ఇచ్చిన డంపింగ్ యార్డ్ ని ఎప్పుడు తరలిస్తున్నారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రశ్నించారు?. శనివారం జయరాం రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రాజీవ్ కాలనీ పంచాయితీ, గుత్తి రోడ్డు నందు నివాసం ఉంటున్న ప్రజలు డంపింగ్ యార్డ్ సమస్య వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు, శ్వాస కోస వ్యాధులకు గురై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే బయోమైనింగ్ ప్రక్రియ, అనుభవం లేని కంపెనీకి కాంటాక్ట్ ఇవ్వడం వలన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, సాక్షాత్తు వైసిపి కౌన్సిలర్లు కౌన్సిల్ మీటింగులో మాట్లాడుతున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు మీకు కూడా? తెలియకుండా డంపింగ్ యార్డ్ తరలింపు ప్రక్రియలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగే అవకాశం ఉంది అంటారా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారిని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం డంపింగ్ యార్డ్ అవినీతి, అక్రమాలపైన తగిన విచారణ జరిపి అనంత నగర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మేము స్వచ్ఛ స్వచ్ఛశీలులం అని రూపించుకోవాలి?. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన డంపింగ్ యార్డ్ ని గుత్తి రోడ్డు నుంచి తరలించి అనంతపురం నగర ప్రజల ఇక్కట్లు తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.