సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకోని ఏకగ్రీవ వైసిపి కార్పొరేషన్

  • జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

నెల్లూరు: జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ 21 డివిజన్ జనసేన కార్యకర్త శరవణ ఆధ్వర్యంలో వారి ఇంటి చుట్టుపక్కల వారిని జనసేన పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ గెలిచిన వై.సి.పీ కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో లేరు. అనేక డివిజనులతో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్యానికి గురి అవుతున్న ప్రజలను పట్టించుకునే నాధుడే లేరు, కార్పొరేటర్లు అందుబాటులో ఉండరు. ఫోన్ ట్యాపింగ్ చేసి మీ నాయకులు ఏమి అనుకుంటున్నారో అని తెలుసుకోవటం కాదు, జగన్ పరదాలు తీసి మీ ప్రభుత్వం గురించి ప్రజలు ఎం అనుకుంటున్నారో కనుక్కోండి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలిచిన కార్పొరేటర్లు సంపాదించుకోవడమే ధ్యేయంగా ఉన్నారు. సుపరిపాలనే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. గాజు గ్లాస్ కి ఓటు వేయించడమే ముఖ్య లక్ష్యంగా ఆరు రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో పాటు శరవణ, సుమంత్ కుమార్, నయీం, హుస్న, సతీష్, సాయి, వెంకీ, తులసి రామ్, ప్రశాంత్ గౌడ్, కంథర్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న, మౌనేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.