వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?

మండల జనసేన అధ్యక్షులు కొట్టే రాజేష్ ఫైర్

రాజంపేట: మండల కేంద్రమైన సిద్దవటం జనసేన పార్టీ కార్యాలయంలో సిద్ధవటం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టే రాజేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏలూరు బహిరంగ సభలో వైసిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక ప్రకారం బడ్జెట్లో లక్ష,18 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో చూపించలేదని నిండు సభలో ప్రజల సమక్షంలో వారాహి యాత్ర ఏలూరు సభలో అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని, అంతేకాకుండా వాలంటీర్లను కించపరిచినట్లు రాష్ట్ర మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు ఇవ్వడం దయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉన్నాయని, రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మహిళలు కించపరిచినట్లుగా ఎన్నో బూతులు మాట్లాడితే అప్పుడు ఎక్కడికి పోయింది. ఈ మహిళా కమిషన్ వ్యవస్థ అని సిద్ధవటం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కే రాజేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు నోటీసు ఇచ్చే ముందు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు, రాష్ట్ర మహిళా మంత్రి రోజాకు, మాజీ మంత్రులు కొడాలి నానికి ముందు నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్ గౌరవం కాపాడాలని, అంతే తప్ప అధికారం ఉంది కదా అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం హేమమైన చర్య అని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థలో మొత్తం డేటా సేకరించడం దానిలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని దాని గురించి మాట్లాడే తప్ప ఎక్కడా ఎవరిని కూడా కించపరిచేటట్లు మాట్లాడలేదని కొంతమంది పేటీఎం బ్యాచ్ దర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంగన్వాడి కార్యకర్తలు వారికి ఇచ్చిన హామీ మేరకు వారు ధర్నా చేస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేకుండా పవన్ కళ్యాణ్ విషయం తెరపైకి తేవడం ఇదంతా పొలిటికల్ డ్రామా అని జనసేన అధ్యక్షులు కే రాజేష్ అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత టార్గెట్ చేయకుండా ఏలూరు సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సమాధానం కాగ్ నివేదిక ప్రకారం లక్ష,18 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో చూపించాలని పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తే జనసేన పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని రాష్ట్ర ప్రజలు మీరు ఆడే పొలిటికల్ డ్రామా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని జనసేన అధ్యక్షులు కే రాజేష్ తెలియజేశారు.