అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

నెల్లిమర్ల: పూసపాటిరేగ మండలంలో బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం కారి అప్పలరాజు, జడ్పిటిసి అభ్యర్థి బూర్ల విజయశంకర్, సీనియర్ నాయకుడు లంక సురేష్ లను మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏఎస్ఐ సురేష్ అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకొని వెళ్లారు. ఈ ఘటనను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు లోకం మాధవి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.