ఎక్కడ జనసైనికులను తొక్కాలని చూస్తే అక్కడ జనసేన జెండా దిమ్మలను ఆవిష్కరిస్తాం

  • జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం

ఉమ్మడి ఖమ్మం జిల్లా, మధిర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాల కోసం, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ… జనసేన పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళ్తున్న మధిర నియోజకవర్గంలో గల చింతకాని మండలం, నగిలిగొండ గ్రామంలో ఇటీవల జనసైనికులు నిర్వహించిన జనసేన అధినేత జన్మదిన వేడుకుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఫ్లెక్సీలను మరియు జెండాలను గుర్తుతెలియని వ్యక్తులు చించి ధ్వంసం చేసి జనసైనికుల మనోభావాలను దెబ్బతినేలా చేశారు. ఇట్టి విషయాన్ని నగిలిగొండ గ్రామ జనసైనికులు ఉమ్మడి ఖమ్మం యువజన విభాగం అధ్యక్షులు జిల్లా డేగల రామచంద్రరావుకు తెలియజేశారు. వెంటనే స్పందించిన డేగల రామచంద్రరావు రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి మరియు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ ల సూచనల మేరకు యువజన విభాగం నగిలిగొండ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకొని ఆ ఘటనకు సంబంధించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ యొక్క ఘటన జరిగిన సమీపంలోనే జనసేన పార్టీ జెండా దిమ్మకు శంకుస్థాపన చేయటం జరిగింది. ఎక్కడ జనసైనికులని తొక్కాలని చుస్తే అక్కడ జనసేన జెండా దిమ్మలని ఆవిష్కారిస్తామని జనసేన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసైనికులకు ఎల్లపుడు అండగా ఉంటామని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన యువజన విభాగం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, యువజన విభాగం ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, సెక్రెటరీ గుండ్ల పవన్ కళ్యాణ్, గుంత సత్యనారాయణ, బోనకల్ మండల అధ్యక్షులు తాళ్లూరు డేవిడ్, జానీ, భరత్ కుమార్ జనసేన పార్టీ కార్యకర్తలు షేక్ మాలిక్, రమణ కుమార్, ఉత్తమ్ రాజ్, సాయి గోపి, గోపికృష్ణ, హరికృష్ణ స్థానిక జనసైనికులు హితీష్, వీరబాబు, శ్రీకాంత్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.