యువతా మేలుకో నీ భవిష్యత్తును కాపాడుకో

  • జనసేన ఝాన్సీ వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన

విజయనగరం: ఝాన్సీ వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయదలిచి సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతీయుత౦గా మహిళ కమిషన్ వాసిరెడ్డి పద్మ ను నిలదీసే కార్యక్రమం, నెల్లిమర్ల ఎమెల్యే బడికొండ అప్పలనాయుడు చేసిన కార్యక్రమానికి నిరసనగా జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం బాలాజీ జంక్షన్ నుంచి పాదయాత్రగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ వరకు వెళ్లి జిల్లా ఎస్పీకి విషయం తెలియని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, లోకం మాధవి, మాత గాయత్రి, పత్తివాడ కృష్ణవేణి, రౌతు కృష్ణవేణి, గంట్లన పుష్పకుమారి, పాతవి దుర్గా మాధవి, జనసేన నాయకులు బాబు పాలూరి, మర్రాపు సురేష్, తుమ్మె అప్పలరాజు దొర, ఆదాడ మోహన్, రవితేజ, తేడా బాలు, తత్తటి సూర్య ప్రకాష్, దిండి రామారావు, జలపారి అప్పటి ద్వారా తదితరులు పాల్గొన్నారు.