ఇచ్చిన హామీలు ఒకటైనా ఎందుకు అమలు చేయలేకపోయారు: సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారూ.. పత్తికొండకు వచ్చి ఇచ్చిన హామీల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడుగుతారా లేకుంటే మాకు అవకాశం ఇప్పించండి అని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం తరఫున మేము అడుగుతాం సిజి రాజశేఖర్ అన్నారు. పత్తికొండలో జనసేన కార్యాలయంలో బుధవారం సిజి రాజశేఖర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ మా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మేడం గారికి మా యొక్క నమస్కారములు మనందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ ఒకటవ తారీఖున పత్తికొండకు వస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు..?? మా పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మీరు అడగవలసింది గత 6 సంవత్సరాల క్రిందట ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా డిసెంబర్ 2వ తారీఖున 2017 సంవత్సరం మీరు మా పత్తికొండకు వచ్చి ఇచ్చిన హామీలు ఒకటైనా ఎందుకు అమలు చేయలేకపోయారు అని అడగండి మేడం గారు. మీరు రావాల్సింది మా పత్తికొండ నియోజకవర్గానికి రైతు భరోసా బటన్ నొక్కడానికి కాదన్నా రైతులకు, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు. త్రాగునీరు, సాగనీరు గ్రామాలలో అభివృద్ధి కల్పించడానికి రావాలి అన్నా అని అడగండి, పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ది శూన్యం కావున మీరు మా పత్తికొండలో ఏవైతే హామీలు ప్రజలకు ఇచ్చినారో వాటికి వెంటనే శంకుస్థాపన చేసి వెళ్లండి అన్నా అని చెప్పండి మేడం. మనం ఇచ్చిన హామీలు గురించి మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, పత్తికొండ నియోజకవర్గం అత్యధికంగా వెనకబడిన నియోజకవర్గం మా నియోజకవర్గంలో ఒక గ్రామాల్లోని సమస్యలైన త్రాగునీరు, సాగునీరు అందించండి రైతులు సంతోషపడతారు ఆనందిస్తారు. నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించండి యువతకి ఉపాధి దొరుకుతుంది. గట్టిగా నిలదీయండి మేడం గారు ఒకవేళ, మీరు నిలదీయ లేకుంటే మాకు అవకాశం ఇప్పించండి మేము అడుగుతాం. మనకు కావలసింది పార్టీలు ముఖ్యం కాదు మన నియోజకవర్గ అభివృద్ధి. మీరు నిలదీసి అడిగితే ప్రజలు, మేము అందరూ సంతోషిస్తాం లేదంటే మాకు వీలైతే మాకు అవకాశం ఇప్పించండి. మీరు మా పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతాం. ముఖ్యంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారు ఇంతవరకు ఎందుకు చేయలేదు?. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు మీరు ఏ ఒక్క మండలంలోనైనా ఒక్క కోల్డ్ స్టోరేజ్ అయిన ఏర్పాటు చేశారా..?. చెరువులకు పిల్ల కాలువలు ద్వారా నీరు ఇస్తాం అన్నారు మీరు ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడ ఎక్కడ అందించారో చెప్పాలి?. పింఛన్ వయసు 45 సంవత్సరాలకే తగ్గించి పింఛన్ మంజూరు చేస్తామన్నారు మీరు ఎందుకు మాట నిలబెట్టుకోలేకపోయారు?. మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి మధ్యలో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు అన్నారు, ఇంతవరకు ఎక్కడ ఏర్పాటు చేశారు?. మా పత్తికొండ నియోజకవర్గం లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు ఎందుకు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా నిలదీస్తామని రాజశేఖర్ తెలిపారు.