బస్ యాత్ర కోసం చెట్లను నరకడం అవసరమా?

పార్వతీపురం: వైసీపీ చేస్తున్న బస్ యాత్ర కోసం డివైడర్ పై ఉన్న చెట్లను తొలగిస్తున్నందుకు గాను పార్వతీపురంలో గురువారం జనసేన నాయకులు గొర్ల చంటి, రాజాన రాంబాబు తదితరులు నిరసన కార్యక్రమం చేపత్తారు. టీడీపీ హయాంలో పార్వతీపురం మున్సిపాలిటీలో పార్వతీపురం సుందరీకరణ అనే స్లోగన్ తో కోట్ల రూపాయలు ఖర్చు చేసి డివైడర్ లు మరియు మొక్కలు నాటడం జరిగింది. 9 సంవత్సారాలలో రాని జబ్బులు ఈ రోజు ఈ చెట్లు వలన ప్రజలు గాలి పీల్చడం వలన రోగాలు వస్తున్నాయి అని సాకుగా చూపుతూ చెట్లు కొట్టడం ఎంతవరకు సమంజసం అని పార్వతీపురం జనసేన నాయకులు పేర్కొన్నారు.